ఓటు వేసేందుకు ఆధార్ కార్డు తప్పనిసరికాదు : కేంద్ర ఎన్నికల సంఘం

వరుణ్

మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (08:55 IST)
ఓటు వేసేందుకు ఆధార్ కార్డు తప్పనిసరికాదని కేంద్ర ఎన్నిక సంఘం స్పష్టం చేసింది. ఓటరు ఐడీ లేదా ఇతర నిర్దేశిత గుర్తింపు పత్రాన్ని చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఓటర్లు ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోయినా, ఇతర చెల్లబాటుయ్యే పత్రాలతో ఓటు వేసేందుకు అనుమతిస్తామని హామీ ఇచ్చింది. బెంగాల్ ప్రజల ఆధార్ కార్డులను కేంద్ర ప్రభుత్వం డీయాక్టివేట్ చేస్తుందని టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొద్ది రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సుఖేందుకు శేకర్ రే, డోలా సేన్, సాకేత్ గోఖలే, లోక్‌సభ ఎంపీలు ప్రతిమా మోండల్, సజ్దా అహ్మద్‌లతో కూడిన టీఎంసీ ప్రతినిధి బృందం కేంద్రం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిసింది. తమ రాష్ట్రంలో ఆధార్ కార్డుల డీయాక్టివేషన్‌పై వస్తున్న ఆరోపణలను లేవనెత్తింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఓటు వేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరికాదని స్పష్టం చేసింది. 
 
"వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వేలాది మంది ప్రజల ఆధార్ కార్డులను చట్టబద్దమైన ప్రక్రియను అనుసరించకుండా డీయాక్టివేట్ చేయడంపై మా ఆందోళనలను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేశాం. రాష్ట్రంలో మొహరించిన కేంద్ర బలాగుల తమ పరిధిలో పని చేసేలా చూడాలని కోరారం. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీఈసీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో కేంద్ర బలగాలు చట్టానికి అనుగుణంగా పని చేసేలా ఆదేశాలివ్వాలని కోరాం అని టీఎంసీ రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు