జమ్మూలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో బాంబు పేలుళ్లు

ఆదివారం, 27 జూన్ 2021 (11:31 IST)
Jammu Air Force Station
జమ్మూలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో కేవలం నిమిషాల వ్యవధిలో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. శనివారం అర్ధరాత్రి 1:45 గంటలకు పేలుళ్లు సంభవించాయని పీటీఐ పేర్కొంది. ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ అధికారులు సైతం అర్ధరాత్రి రాత్రి దాటిన తరువాత సంభవించిన బాంబు పేలుళ్లపై ట్వీట్ చేశారు.
 
ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లోని టెక్నికల్ ఏరియాలో భవనం పైకప్పు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. తొలి బాంబు టెక్నికల్ విభాగంలో సంభవించగా, రెండో బాంబు పేలుడు గ్రౌండ్ ఫ్లోర్‌లో జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి పరికరాలు, వస్తువులు దెబ్బతినలేదని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. 
 
బాంబు పేలుళ్ల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్, ఇతర టెక్నికల్ టీమ్ విభాగాలకు చెందిన అధికారులు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరా తీశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు