రాధామోహన్ సింగ్. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేత, కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి. ఈయన కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు నుంచే నా రూటే సెపరేట్ అంటున్నారు. వ్యవసాయ శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతుల ఆత్మహత్యలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇపుడు బహిరంగంగా పాట(మూత్రవిసర్జన)పాడి వార్తలకెక్కారు.
నిజానికి స్వచ్ఛ భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహర్నిశలు శ్రమిస్తున్నారు. స్వచ్ఛ భారత్‌ను ఒక ఉద్యమంలా చేపట్టి, విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. చేస్తున్నారు కూడా. స్వయంగా చీపురు పట్టి వీధులు కూడా చిమ్ముతున్నారు. దీంతో బీజేపీ నేతలంతా అందరూ తమదైనశైలిలో స్వచ్ఛ్ భారత్ నినాదంతో ముందుకెళ్తున్నారు.