పట్టా లేని ట్రాక్‌పై ఉత్కల్ ఎక్స్‌ప్రెస్... నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టిన ఆడియో టేప్
బుధవారం, 23 ఆగస్టు 2017 (10:12 IST)
పట్టాలు లేని ట్రాక్‌పై రైలు వెళ్లగలదా? ఓ.. ఎస్. వెళ్లగలదు. మరెక్కడా సాధ్యంకానిది మన దేశంలో సాధ్యమవుతుంది. అందుకే దేశంలో రైలు ప్రమాదాలు లెక్కకు మించి జరుగుతున్నాయి. అయినా రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వీడదు... పాలకులు నిద్రమత్తును వీడరు.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉత్కల్ రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని తేలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడో ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గేట్‌మ్యాన్, అతడి స్నేహితుడి (ఉద్యోగి) మధ్య హిందీలో జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు వెలుగులోకి వచ్చి షికార్లు చేస్తోంది. దాని ప్రకారం.. వారిద్దరు ఏం మాట్లాడుకున్నారంటే..
గేట్‌మ్యాన్: ఇక్కడికో జేఈ పోస్టింగ్‌పై వచ్చాడు. అతడి మాట ఎవ్వరూ వినడం లేదు. 30 నిమిషాలు మాత్రమే పనిచేసి క్వార్టర్స్‌కు వెళ్లిపోయాడు. కీమ్యాన్ గేటు వరకు వెళ్లి వెనక్కొచ్చాడు. పెట్రోలింగ్ పరిస్థితి ఇలా ఏడ్చింది. వారిని ప్రశ్నించేవాడు ఒక్కడు కూడా లేడు.
ఉద్యోగి: ఏం జరిగింది?
గేట్‌మ్యాన్: పట్టాలపై వెల్డింగ్ వర్క్ జరుగుతోంది. అయితే ఆ ట్రాక్‌ను బ్లాక్ చేయడానికి మాత్రం ఒప్పుకోవడం లేదు. జేఈ మాత్రం వర్క్ ప్రారంభించాడు. ట్రాక్ మీద కొంత భాగాన్ని కట్ చేసి పక్కన పెట్టారు. అది తిరిగి వెల్డింగ్ చేయడానికి ముందే రైలు వచ్చేసింది. నేనైతే గేట్ మూసేశాను. అప్పటికే ఉత్కల్ రైలు వచ్చేసింది. ట్రాక్ మాత్రం లేదు. అందుకే రైలు పట్టాలు తప్పింది.
ఉద్యోగి: అంటే ట్రాక్‌ను పక్కన పెట్టారా?
గేట్‌మ్యాన్: లేదు.. కొంత భాగాన్ని తీశారు. తర్వాత దానిని అమర్చినా వెల్డింగ్ చేయలేదు.
ఉద్యోగి: ఆహా..
గేట్‌మ్యాన్: ట్రాక్‌పై నుంచి నాలుగు కోచ్‌లు ముందుకెళ్లాయి. వర్క్ జరుగుతున్నా ఆ విషయాన్ని తెలిపే బోర్డు కానీ, స్టాప్ సిగ్నల్ కానీ ట్రాక్‌పై పెట్టలేదు.
గేట్‌మ్యాన్: వెల్డింగ్ మెషీన్ ట్రాక్ మధ్యలోనే ఉండిపోయింది.
ఇదిలావుంటే మరో ఆడియో క్లిప్ కూడా చక్కర్లు కొడుతోంది. అందులో...
ఉద్యోగి 1: సర్.. వారు ట్రాక్‌ను 20 నిమిషాలపాటు బ్లాక్ చేయాలని అడుగుతున్నారు.
ఉద్యోగి 2: ఏ బ్లాక్?
ఉద్యోగి 1: వారు గ్లూ జాయింట్ గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా ట్రైన్లు వచ్చే అవకాశం ఉండడంతో అదెలా సాధ్యమని అడిగా?
ఉద్యోగి 1: నువ్వు చెప్పే ట్రైన్ ఎక్కడికి చేరుకుంది?
ఉద్యోది 3: అది ఇప్పటికే కాంట్ స్టేషన్ దాటింది. సిటీ స్టేషన్‌లో ఆగింది.
ఉద్యోగి 1: సర్, నేను వారికి 15 నిమిషాలు బ్లాక్ చేయమని చెప్పనా?
ఉద్యోగి 2: లేదు, బ్లాక్ చేసేందుకు నేను ఒప్పుకోను. అక్కడ అంత సమయం లేదు.