ఉత్తరాఖండ్‌లోని ధౌలిగంగ నదిలో ఆ రాత్రి మరోసారి నీటిమట్టం పెరిగింది. చమోలీ జిల్లాలోని జోషిమఠ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం నందా దేవి హిమానీనదం విరిగిపడింది. దీంతో ధౌలిగంగ నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. కాగా, ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో నీటి ఉధృతి మళ్లీ పెరిగింది. దీంతో చమోలీ ప్రాంతంలో పోలీసుల ప్రజలను అప్రమత్తం చేశారు.