డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్ : జవదేకర్

శుక్రవారం, 28 మే 2021 (20:45 IST)
వ్యాక్సినేషన్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ చేసిన వ్యా్ఖ్యలకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కౌంటర్ ఇచ్చారు. డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చేస్తామని జవదేకర్ ప్రకటించారు.

డిసెంబర్ నాటికి 108 కోట్ల భారతీయులకు వ్యాక్సిన్ ఇచ్చేస్తామని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ అవుతున్న దేశం భారత్ అన్న విషయాన్ని రాహుల్ గుర్తిస్తే బాగుంటుందని జవదేకర్ పేర్కొన్నారు.

‘‘డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చేస్తాం. ఎలా అన్నది కేంద్ర ఆరోగ్య శాఖ ఓ బ్లూ ప్రింట్‌ను కూడా సిద్ధం చేసింది.

వ్యాక్సినేషన్ పై అంత శ్రద్ధ ఉంటే మీరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై దృష్టి నిలపండి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ వ్యాక్సినేషన్ విషయంలో గజిబిజే’’ అని జవదేకర్ మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు