మరుగుతున్న నూనెను కస్టమర్లపై పోశాడు (video)

శుక్రవారం, 10 నవంబరు 2017 (11:26 IST)
రోడ్డు పక్కనే వున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫుడ్ బాగోలేదని.. వాసన వస్తుందని ఆ షాపు వంటమనిషిని ప్రశ్నించిన యువకులకు చేదు అనుభవం ఎదురైంది. ఆహారం బాగోలేదని చెప్పిన పాపానికి మరుగుతున్న నూనెను జగ్గులోకి తీసుకుని మరీ వారిపై పోశాడు వంటమనిషి. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబై మహానగరం థానే ఏరియాలోని ఉల్సాస్ పూర్ ప్రాంతంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇద్దరు యువకులు ఫుడ్ ఆర్డర్ చేశారు. అయితే క్వాలిటీ బాగోలేదని.. వాసన వస్తుందని.. ఫుడ్ సెంటర్‌లో తయారీ దారుడిని ప్రశ్నించారు. దీనిపై అతను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఇద్దరు కస్టమర్లు ఈ ఫుడ్‌ను అతనిపై విసిరేశారు. దీంతో వంటమనిషిని కోపం తలకెక్కింది. పరిగెత్తిన వారిని పట్టుకోవాలనుకున్నాడు. వాళ్లు చిక్కకపోవడంతో మరుగుతున్న నూనెను జగ్గులోకి తీసుకుని వాళ్లపై చల్లాడు. ఈ ఘటనలో యువకులిద్దరిపై కాకుండా.. మిగిలిన కస్టమర్లపై కూడా నూనెపడి గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరిగే నూనెను పోసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోని ఇద్దరిని అరెస్ట్ చేశారు.
 
మరోవైపు గుజ‌రాత్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ఎమ్మెల్యే క‌రంసీ ప‌టేల్ కుమారుడు కాను ప‌టేల్ ఓవరాక్షన్ చేశాడు. అహ్మ‌దాబాద్‌కి 15 కిలోమీట‌ర్ల దూరంలో ఉండే జంబుతా గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. తన పెట్రోల్ బంకులో రూ.6 ల‌క్ష‌లు మాయమయ్యాయని ఆరోపిస్తూ, వేడి వేడి నూనెలో 10 మంది ఉద్యోగులను చేతులు పెట్టమన్నాడు. అలా చేస్తే చోరీ ఎవ‌రు చేశారో తనకు తెలుస్తుంద‌ని న‌మ్మాడు. అతని ఆదేశానికి తలొగ్గిన ఉద్యోగులు అతను చెప్పిన ప్రకారం చొక్కాలు విప్పేసి, వరుసగా నిలబడి వేడి నూనెలో చేతులు పెట్టారు. చివరికి చేతులు కాల్చుకున్నారు. 

#WATCH:Owner of a roadside eatery threw hot oil on a customer who complained about the food served, in Maharashtra's Ulhasnagar. 2 arrested pic.twitter.com/ypsfVKHRGn

— ANI (@ANI) November 9, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు