ఓ కోతి పెట్రోల్‌కు బానిస అయింది. వివిధ రకాల ఆహార పదార్థాలు ఇస్తున్నా కోతి ఆరగించడం లేదు. కానీ, పెట్రోల్ మాత్రం గటగటా తాగేస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... హర్యానా రాష్ట్రంలోని పానిపట్ పట్టణంలో ఇన్సార్ బజార్ అనే ఏరియా ఉంది. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు. దీంతో రోజూ వేలాది మంది ఈ ఏరియాకు వచ్చి పోతుంటారు. ఇటీవల పార్కింగ్ చేసిన బైక్స్ నుంచి పెట్రోల్ మాయమైపోవడాన్ని గుర్తించారు.
అలా షాపులోకి వెళ్లి వచ్చేసరికి బండిలో పెట్రోల్ ఖాళీ అయ్యేది. మొదట ఎవరైనా దొంగతనం చేస్తున్నారని అనుమానించారు. కానీ, ప్రతి రోజూ ఇలానే జరుగుతుండటంతో పెట్రోల్ చోరీపై ప్రత్యేక నిఘా పెట్టగా, అసలు విషయం తెలుసుకుని షాక్‌కు గురయ్యారు.
పార్కింగ్ చేస్తున్న బైక్స్ నుంచి పెట్రోల్ మాయం చేసేది చోరులు కాదనీ, ఓ కోతి అని తెలుసుని ఆశ్చర్యపోయారు. పార్కింగ్ చేసే స్కూటర్లలోని పెట్రోల్ ట్యాంక్ ట్యూబ్ లాగేసుకుని.. చక్కగా నోట్లో పెట్టుకుని తాగేస్తుంది. ఈ విషయం గమనించిన స్థానికులు దానికి ఆహారం అందించానికి ప్రయత్నించారు. అరటిపండ్లు, ఇతర ఆహార పదార్ధాలు ఇస్తున్నా తీసుకోవటం లేదు. కేవలం పెట్రోల్ మాత్రమే తాగుతుంది.