గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణం

ఆదివారం, 7 ఆగస్టు 2016 (15:31 IST)
గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని గాంధీన‌గ‌ర్‌లోని మ‌హాత్మా మందిర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గ‌వ‌ర్న‌ర్ ఓపీ కోహ్లి ఆయ‌న‌తో ప్ర‌మాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్‌ ప్రమాణం చేశారు. మరో 23 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. 
 
ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ పర్యటన కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరుకాలేక పోయారు. ఆనందీబెన్ రాజీనామాతో ఆమె వారసుడిగా బీజేపీ అధిష్టానం రూపానీకి గుజరాత్ పగ్గాలు అప్పగించింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని విజయతీరాలకు నడిపించే బాధ్యతను రూపానీపై పెట్టింది.  

వెబ్దునియా పై చదవండి