ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో కనిపించిన మోనాలిసా ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయితే, యూపీలోని ఆమె ఇల్లు ఎలా ఉందో తెలిపే వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ మహాకుంభమేళాలో ఓ సుందరి తళుక్కున మెరిసిన విషయం తెల్సిందే. ఈ సుందరి ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి. నల్ల పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముకునే ఈ యువతి ఫోటో, వీడియోను ఓ యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ అయిపోయారు.
ఇదిలావుంటే, రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కే ఆర్సీ-16లో కూడా మోనాలిసాకు సినిమా అవకాశం ఇవ్వనున్నట్టు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైన విషయం తెల్సిందే. ఆర్సీ-16 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో మోనాలిసాకు ఎలాంటి పాత్ర ఇస్తారన్న అంశంపై క్లారిటీ లేదు. కానీ, టాలీవుడ్‌లో మాత్రం మత్తుకళ్ల సుందరికి సినిమా ఛాన్స్ మాత్రం ఖాయమనే ప్రచారం సాగుతోంది.