ఆ బండిపై ప్రయాణించే వ్యక్తి నబాబ్ అని తెలిసింది. అతను బెడ్-కార్‌ను నిర్మించి, వీధుల్లో రైడ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం 64 మిలియన్లకు పైగా వీక్షణలతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వింత వాహనంలో పూర్తి సైజు బెడ్, మెట్రెస్, బెడ్‌షీట్, దిండ్లు ఉన్నాయి. మంచం కింద అమర్చబడిన చక్రాలు దానిని రోడ్డుపైకి ఎంచక్కా ప్రయాణించేలా చేశాయి.