మహిళల కోసం.. లేడీస్ స్పెషల్.. ఎక్కడో తెలుసా?

బుధవారం, 21 అక్టోబరు 2020 (20:01 IST)
trains
కోవిడ్ కారణంగా మూతపడిన సంస్థలన్నీ మెల్లమెల్లగా తెరుచుకుంటున్నాయి. కరోనా వైరస్ లాక్ డౌన్ అన్‌లాక్ 5.0 ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ప్రత్యేకంగా మరో నాలుగు రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది. వెస్ట్రన్ రైల్వే బుధవారం ముంబైలో నాలుగు 'లేడీస్ స్పెషల్' రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది.
 
మహిళల కోసం మొత్తం 6 రైళ్లను నడుపుతున్నట్లు పేర్కొంది. మహిళా ప్రయాణికులందరినీ ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణించని గరిష్ట సమయంలో అనుమతించినట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కోవిడ్ -19 లాక్‌డౌన్ మధ్య వెస్ట్రన్ రైల్వే నెట్‌వర్క్‌లో మొత్తం రోజువారీ సేవలు 704కు పెరిగినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
 
కాగా.. తాము లోకల్ రైళ్లలో మహిళల ప్రయాణానికి అనుమతి ఇచ్చేందుకు ఎప్పుడో సిద్ధంగా ఉన్నామని, అయితే మహారాష్ట్ర సర్కారు నుంచి లేఖ వచ్చిన తరువాతనే దీనికి అనుమతినిచ్చామని పీయూష్ తెలిపారు. దీనికి ముందు అక్టోబరు 16న కేంద్ర ప్రభుత్వం లోకల్ రైళ్లలో మహిళలు ప్రయాణించేందుకు అనుమతినివ్వడాన్ని మహారాష్ట్ర సర్కారు అంగీకరించలేదు. అయితే ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా లోకల్ రైళ్లలో మహిళలు ప్రయాణించేందుకు అనుమతినిచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు