భర్త చికెన్ తిన్నాడని భార్య ఆత్మహత్య

శుక్రవారం, 27 ఆగస్టు 2021 (06:37 IST)
భర్త చికెన్ తినడంతో అతడి భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఛత్తీస్ గఢ్ సూరజ్ పూర్ లో చోటు చేసుకుంది. కరౌదా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆగస్టు 22 న తన పొరుగున ఉన్న బంధువుల ఇంట్లో చికెన్ తిన్నాడు.

అయితే అది శ్రావణ మాసం చివరి రోజు కావడంతో పాటు రాఖీ పౌర్ణమి కావడం వల్ల మాంసం తినవద్దని భార్య వారించింది.

అయినా భార్య మాటలను పట్టించుకోని భర్త చికెన్ కర్రీ తిన్నాడు. దీంతో మనస్తాపం చెందిన భార్య మనీషా సింగ్ (19) ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
 
ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మనీషా సింగ్ ను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. కాగా సాధారణంగా కొంత మంది ప్రజలు శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదనే నియమాలను పాటిస్తారనే సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు