చెన్నైకి చెందిన భాస్కర్ మాజీ వార్డు మెంబర్. నాలుగు సరుకు రవాణా లారీల ఓనర్. అలాగే రెండు పరిశ్రమలు కూడా ఉన్నాయి. బాగా ఆస్తిపరుడు 15 సంవత్సరాల క్రితం కీల్పాకంకు చెందిన ఉషతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఉష తమ్ముడు సెల్వం రెండు సంవత్సరాల క్రితమే బావ దగ్గరకు వచ్చి ఆయన దగ్గరే పనిచేస్తూ ఉండేవాడు.
ముగ్గురు కలిసి రెండురోజుల క్రితం నిద్రిస్తున్న భాస్కర్‌ను అతి కిరాతకంగా నరికి చంపేసి ఊరి బయట వుండే చెరువులో పడేశారు. మరోవైపు బెడ్ పైన రక్తపు మరకలు మొత్తాన్ని తుడిచేసి కనిపించకుండా పోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే భాస్కర్ మృతదేహాన్ని నిన్న కనుగొన్న పోలీసులు. మృతుడి తరపు బంధువులు అతడి భార్యపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీనితో అసలు విషయం బయటపడింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.