హైపర్ ఆది వ్యక్తిత్వం అలాందిట..?

మంగళవారం, 4 మే 2021 (19:39 IST)
తెలుగు బుల్లితెర స్టార్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆది కెరియర్ జబర్దస్త్ ప్రోగ్రాం లో జూనియర్ ఆర్టిస్ట్ గా ప్రారంభించాడు. తర్వాత స్క్రిప్ట్ రైటర్ గా పవర్ ఫుల్ పంచ్ లకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. ప్రస్తుతం జబర్దస్త్ ప్రోగ్రాం టీం లీడర్ గా విశేషమైన ఆదరణ పొందుతూనే వెండితెరపై హాస్యనటునిగా తన జర్నీ ప్రారంభించాడు.
 
హైపర్ ఆది, దొరబాబు, దొరబాబు భార్య అమూల్య ఈ ముగ్గురు ఈ మధ్య ఓ షోలో పాల్గొన్నారు.ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన సుడిగాలి సుధీర్ దొరబాబుని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని అమూల్యని అడగ్గా.. తన ఇంట్లో వాళ్ళు దొరలాంటివాడిని పెళ్లి చేసుకోమని చెబితే దొరలాంటివాడు ఎందుకని దొరబాబునే చేసుకున్నా అంటూ పంచ్ వేసింది అమూల్య. దానికి ఆది కౌంటర్ వేస్తూ నీకు ఫాలోయింగ్ ఆ రేంజ్‌లో ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థం అయింది అంటూ ఆది నవ్వుల వర్షం కురిపించాడు.
 
తర్వాత ఆమూల్య మాట్లాడుతూ, ఆది వ్యక్తిత్వం పై కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'మేము కష్టాల్లో ఉన్న సమయంలో ఎవరూ మాకు తోడుగా లేరు. ఇక మాకు ఎవరు లేరని అనుకున్న సమయంలో హైపర్ ఆది మాకు దేవుడిలా సాయం చేశాడు.అందుకే ఆది నెంబర్‌ను మా ఫోన్‌లో గాడ్‌ అని సేవ్ చేసుకున్నాం అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది వ్యక్తిత్వం చాలా గొప్పదంటూ ఆది అభిమానులు, నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు