సీఎం సాబ్ మీటింగ్‌కు వస్తే బుర్ఖా తొలగించాల్సిందే (వీడియో)

బుధవారం, 22 నవంబరు 2017 (11:52 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పాలిత ప్రభుత్వ పాలన సాగుతోంది. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ కొనసాగుతున్నారు. కరుడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడిన యోగి ఆదిత్యనాథ్.. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ముందుకు సాగుతూ పాలన సాగిస్తున్నారు. అయితే, ఈయన పాల్గొనే సభలు, సమావేశాలు, బహిరంగ సభలకు వచ్చే హిందూయేతర మహిళలకు కష్టాలు తప్పడం లేదు. 
 
తాజాగా, రాష్ట్రంలోని బాలియాలో మంగళవారం జరిగిన ఓ బహిరంగ సభలో ముస్లిం మహిళ పాల్గొంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆ ముస్లిం మహిళ ధరించిన బుర్ఖాను తొలగించాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆ మహిళ మరోమాట మాట్లాడకుండా బుర్ఖాను తొలగించి, ఇతర మహిళలతో కలిసి కూర్చుండిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
 

#WATCH: Woman asked by police to remove Burqa during CM Yogi Adityanath's rally in #UttarPradesh's Ballia, yesterday. pic.twitter.com/CgkQWUnXlC

— ANI UP (@ANINewsUP) November 22, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు