ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ కోసం కన్నబిడ్డలను అనాధలుగా వదిలి పారిపోయింది.. ఓ తల్లి. ఈ ఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ వ్యామోహం టీనేజ్ పిల్లల నుంచి పెద్దల వరకు వుంది. ఇన్‌స్టాగ్రామ్ కారణంగా ఎందరో వేలు వేలు సంపాదించుకుంటున్నారు. అయితే కొందరు పెడదారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనే సేలంలో చోటుచేసుకుంది.