మూత్ర విసర్జన కోసం బస్సు ఆపలేదనీ ఆ మహిళ ఎంత పని చేసిందో తెలుసా?

మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (17:23 IST)
మూత్ర విసర్జన కోసం బస్సును ఆపమంటే ఆ డ్రైవర్, కండక్టర్ ఆపలేదు. దీంతో ఓ మహిళ ఇక బిగపట్టలేక బస్సు నుంచి కిందికి దూకేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లా ఇడయాన్‌కుళం ఏరియాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇడయాన్‌కుళం ప్రాంతానికి చెందిన పాండియమ్మాళ్ అనే మహిళ ఆండిపట్టి నుంచి శ్రీవిల్లిపుత్తూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కింది. మార్గమధ్యంలో ఆమె అత్యవసరంగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చింది. బస్సును ఒక్క నిమిషం ఆపాలని ఆమె డ్రైవర్‌ను, కండక్టర్‌ను ప్రాధేయపడినా వారు వినిపించుకోలేదు. 
 
దీంతో ఆమె బస్సు నుంచి దూకేసింది. దాంతో గాయాలపాలు కావడంతో తొలుత విల్లిపుత్తూర్ ప్రభుత్వాసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం మదరై రాజాజీ ఆస్పత్రికి తరలించారు. సం మధురై రాజాజీ ఆసుపత్రికి ఆమెను తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు