ముందుగా కుక్కర్లో బియ్యం, పెసరపప్పును కడిగి రెండింతలు నీరు పోసి ఉడికించుకోవాలి. రెండు లేదా నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి. వెడల్పాటి బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక మిరియాలు, జీలకర్ర, అల్లం, జీడిపప్పు వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత మిరియాల పొడిని, జీలకర్ర పొడిని కూడా చేర్చుకోవాలి. ఇందులో ఉడికించిన అన్నాన్ని చేర్చుకోవాలి. ఉప్పు, పంచదార వేసి బాగా కలపాలి. చివర్లో రెండు స్పూన్ల నెయ్యిని చేర్చి దించేయాలి. ఆరిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి.