కువైట్‌లో ఘనంగా తెలుగు సాంస్కృతికోత్సవం

FILE
మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని "కువైట్ తెలుగు కళా సమితి" ఆధ్వర్యంలో జరిగిన తెలుగు సాంస్కృతికోత్సవం వైభవంగా జరిగింది. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే కళా వైభవంతోపాటు.. ఉత్తేజపరిచే దేశభక్తి గీతాలతో గాంధీ జయంతిని ప్రవాసాంధ్రులు ఘనంగా జరుపుకున్నారు.

ఈ విషయమై ప్రముఖ గాయని ఆమని మీడియాతో మాట్లాడుతూ.. కువైట్ తెలుగు కళాసమితి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన తాను లలిత గీతాలు, ప్రబోధ దేశభక్తి గీతాలను ఆలాపించినట్లు వెల్లడించారు. కువైట్ తెలుగు ప్రజలు మన సంస్కృతీ సంప్రదాయాలపట్ల చాలా మక్కువగా ఉన్నారనీ అన్నారు.

గాంధీ పుట్టిన దేశం, నీ ధర్మం నీ సంఘం, ఈనాడే బాపూ నీ పుట్టిన రోజు, మౌనంగానే ఎదగమని.. లాంటి పాటలు కువైట్ తెలుగు ప్రజలను ఈ సందర్భంగా విశేషంగా ఆకట్టుకున్నాయని ఆమని వివరించారు. ఇక తెలుగు సంస్కృతిని, పాటల విశ్లేషణను చక్కగా వివరించిన వ్యాఖ్యాత సుధామయికి తెలుగు కళాసమితి ఘనంగా అభినందించినట్లు ఆమె తెలిపారు.

వెబ్దునియా పై చదవండి