న్యూయార్క్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం... ప్లూ షాట్స్ పంపిణీ

బుధవారం, 21 నవంబరు 2018 (15:31 IST)
ఫ్లషింగ్: సాటివారికి సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. ఉచిత వైద్య శిబిరాలతో మరింత సేవా కార్యక్రమాలను విసృతపరుస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ న్యూయార్క్ లోని తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోషియేషన్‌తో కలిసి శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. దాదాపు 100 మంది తెలుగువారు ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్య సేవలు పొందారు. ఇక్కడ రోగులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. 
 
బ్లడ్ షుగర్, రక్తపోటు పరీక్షలు కూడా ఉచితంగా చేసి రోగులకు కావాల్సిన మందులు, వైద్యసేవలు అందించడం జరిగింది. ఇందులో ఆరుగురు రోగులకు ఇటీవలే మదుమేహం వచ్చినట్టు గుర్తించారు. మరో నలుగురు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్టు తేలింది. వీరిని ఉచిత వైద్య ఆసుపత్రులకు వెళ్లమని డాక్టర్లు సూచించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్టు తేలడంతో ఒక అతనినిని  పరీక్షించి డా. అల్లూరి జగ్గారావు గారు ఆసుపత్రికి కూడా పంపించడం జరిగింది. 
 
మొదటగా వచ్చిన 50 మందికి ప్లూ షాట్స్ కూడా ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ సౌమ్య ముతికి, జానకి కనుమిల్లి  ఇచ్చారు.. వెస్ట్ నాసావు డయాలసీస్ సెంటర్ వారు ఈ ప్లూ షాట్స్‌ను స్పాన్సర్ చేయడం జరిగింది. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్యాం నాళం మధుమేహ రోగుల్లో అవసరమైన వారికి 20 బ్లడ్ షుగర్ మిషన్లను పంపిణి చేయడం జరిగింది. డాక్టర్స్ శిఖా జైన్, ప్రణీత్ కొర్రపాటి, శైలజ కాల్వ, ప్రత్యూష బండి, జానకి కానుమిల్లిలు రోగులకు మెడికల్ చెకప్స్ చేశారు. 
 
నాట్స్ మాజీ ఛైర్మన్ డా. మధు కొర్రపాటి, నాట్స్ ప్రతినిధి అరుణ్ శ్రీరామినేనిలు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. టీఎల్ సీఏ ప్రెసిడెంట్ తాపీ ధర్మారావు, ప్రెసిడెంట్ ఎలక్ట్ అశోక్ చింతకుంట, సెక్రటరీ బాబు కుదరవల్లి, ఈసీ మెంబర్స్ ప్రసాద్ కోయి, సురేష్ తమ్మినేని తదితరులు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహణకు తోడ్పాడ్డారు. సంజన ఎర్నకి, హర్షిణి, తారణి సురేష్, బిందు కోయి, వేదాంత్ జైన్ తదితర విద్యార్ధులు వాలంటీర్లుగా ఈ శిబిరంలో సేవలు అందించారు. షిరిడీ సాయి దేవాలయం వాలంటీర్లు సత్యం గులివెందుల, డాక్టర్ సుజనీ వర్మ శిబిరం నిర్వహణకు సహాయ సహకారాలు అందించడంతో పాటు వైద్యులకు, వాలంటీర్లకు భోజన సదుపాయం కల్పించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు