తెలుగువారి సంక్షేమం కోసం ఏర్పడిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా కుచిబొట్ల కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కుచిబొట్ల శ్రీనివాస్ పైన కాల్పులు జరుపుతున్నప్పుడు అతడిని రక్షించేందుకు ప్రాణాలకు తెగించి అడ్డుపడ్డ శ్వేత జాతీయుడు ఇయాన్ గ్రిల్లట్‌ను సన్మానించాలని నిర్ణయించింది. ఆరోజు ప్యురింటన్ చేసిన దాడిలో గ్రిల్లట్‌కు కూడా తూటాలు తగిలాయి. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.
2017 మే నెలలో సెయింట్ లూయిస్‌లో జరగనున్న వేడుకలో గ్రిల్లట్‌ను తానా సన్మానించాలని, అలాగే కూచిబొట్ల కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రయత్నం చేస్తోంది. గోఫండ్‌మీ అనే సంస్థ ఇప్పటికే కన్సాస్ దాడి బాధితులను ఆదుకునేందుకు సుమారుగా రూ. 7 కోట్లు విరాళాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు అందించాలని సన్నాహాలు చేస్తున్నారు.