పసుపు రంగు పువ్వులు, బూందీ లడ్డూలు, మోదకాలు నైవేద్యంగా సమర్పించాలి. అరటిపండ్లు సమర్పించవచ్చు. గణేశ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ రోజున సంకష్టి చతుర్థి కథను చదవండి లేదా వినండి. పూజ అనంతరం గణేశునికి హారతిని ఇచ్చి.. అనంతరం ప్రసాదాన్ని అందరికీ పంచాలి.
సాయంత్రం చంద్రోదయం తరువాత చంద్రునికి అర్ఘ్యం సమర్పించి దర్శనం చేసుకోండి. అప్పుడు ఉపవాసం విరమించండి. ఈ రోజు పూజ తర్వాత, బ్రాహ్మణులకు ఆహారం అందించడంతో పాటు పేదలకు దానం చేయడం ముఖ్యంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.