Amalaki Ekadashi: అమలక ఏకాదశి : ఉసిరి చెట్టు కింద ఆవ నూనెతో దీపం.. జాతక దోషాలు మటాష్

సెల్వి

సోమవారం, 10 మార్చి 2025 (10:16 IST)
అమలక ఏకాదశి రోజును కొంతమంది ఉసిరికాయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. అమలక ఏకాదశి రోజున ఉసిరి చెట్టును భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఉసిరిచెట్టులో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కొలువై ఉంటారని భావించి ఈ చెట్టును పూజించడం జరుగుతుంది. ఈ ప్రత్యేకమైన రోజున ఉసిరిచెట్టుకు నీరు పోయడం, ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో పాటు "ఓ శ్రీ విష్ణు ప్రియాయ నమః" మంత్రాన్ని జపించడం ద్వారా కూడా అనుకూల ఫలితాలు చేకూరుతాయి. వీలైతే ఉసిరి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే జాతకాల్లో గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయి.
 
అమలక ఏకాదశి రోజున నియమనిష్టలు పాటించి ఉపవాసాలు చేసే భక్తులకు లక్ష్మీదేవి కటాక్షం ఉండటం వల్ల కోటీశ్వరులు అవుతారని పురాణాల ద్వారా వెల్లడవుతోంది. ఆర్థిక కష్టాలు ఉన్నవాళ్లు సైతం ఉసిరి చెట్టును పూజించడం ద్వారా ఆ కష్టాల నుంచి సులువుగా గట్టెక్కుతారు.
 
ఫాల్గుణ మాస శుక్ల పక్ష ఏకాదశి రోజున అమలక ఏకాదశి జరుపుకుంటారు. ఈ సంవత్సరం మార్చి నెల 10వ తేదీన అమలక ఏకాదశి.  అమలక ఏకాదశి రోజున దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. వీలైతే పసుపు రంగు వస్త్రాలను ధరించి ఉసిరికాయలను, ఇతర ఫలాలను దానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు