ఆహారాన్ని వృధా చేస్తే.. అన్న దోషం ఏర్పడుతుంది. అన్నాన్ని ద్వేషించడం ద్వారా అన్నదోషం ఏర్పడుతుంది. అలాగే ఆహారపు కొరతతో ఇబ్బందులు పడేవారు కార్తీక పౌర్ణమి రోజున అన్నాభిషేకంలో, అన్నంతో అలంకృతమయ్యే శివునిని పూజించినట్లైతే, సందర్శించినట్లైతే దారిద్ర్యం తొలగిపోతుంది.
అన్నదోషం కనుక వున్నట్లైతే.. ఇంట్లో ఎంత సంపాదించినా సిరిసంపదలు నిలకడగా వుండవు. ఆహారం వున్నా.. ఒక పూట అన్నం తృప్తిగా భుజించే వీలుండదు. ఈ సమస్యలు తొలగిపోవాలంటే.. అన్నపూర్ణమను తలచి వ్రతం చేయాలి. ఆపై అన్నదానం చేయాలి. అందుకే కార్తీక పౌర్ణమి రోజున అన్నాభిషేకం చేయించడం, అమ్మవారిని పూజించడం వంటివి చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. దారిద్ర్యం తొలగిపోతుంది.
ఆకలితో అలమటించే వారికి ఆహారం ఇవ్వకపోవడం, పిల్లలు ఆకలితో వున్నా ఆహారం పెట్టకపోవడం, వృద్ధులకు, గర్భిణీ మహిళలను ఆహారం సరిగ్గా అందివ్వకపోవడం, వారిని ఆహారం తీసుకోనివ్వకుండా చేయడం వంటివి చేస్తే అన్నదోషం తప్పదు. విందుల్లో తినేందుకు కూర్చున్న వారిని సగంలో లేపడం వంటివి చేయకూడదు.
తనకు మించి ఆహారం వున్నా.. దాన్ని ఇతరులకు ఇవ్వకుండా చెత్తకుండీలో వేయడం.. ఆహారాన్ని వృధా చేయడం వంటివి చేస్తే అన్నదోషం ఏర్పడుతుంది. పితృదేవతలకు పిండ ప్రదానం చేయకపోవడం, వృద్ధులకు ఆహారం ఇవ్వకపోవడం ద్వారా దోషాలు ఏర్పడుతాయి.