సోమవారం భస్మధారణ తప్పనిసరి.. ఎందుకో తెలుసా?

సోమవారం, 4 జనవరి 2021 (05:00 IST)
సోమవారం భస్మధారణ తప్పనిసరి. విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ వుంటాడు. నరకబాధలు లోనుకాకుండా చూస్తాడు. కాల్చిన పేడను ఈ భస్మంలో ఉపయోగిస్తూ వుంటారు. భస్మధారణ చేయకుండా జపతపాలు ఫలితాలు ఇవ్వవని శాస్త్రాలు చెప్తున్నాయి. శరీరంలో 32 చోట్ల భస్మధారణ చేయాలని శాస్త్ర వచనం. 
 
శిరస్సు, రెండు చేతులు, గుండె, నాభి అనే ఐదు ప్రదేశాల్లో భస్మాన్ని ధరించవచ్చు. మూడు గీతలు అడ్డంగా భస్మధారణ చేయాలి. ఇలాచేస్తే జన్మజన్మల పాపాలు నశించి పోతాయి. ఈ విభూతి మహిమను వివరించే కథ దేవి భాగవతము పదకొండో స్కందములో వంటిది. భస్మాన్ని ధరించడం ద్వారా శరీరంలోని అధిక శీతలతను పీల్చుకొంటుంది. జలుబు, తలనొప్పులు రాకుండా కాపాడుతుంది. భస్మాన్ని నుదుట ధరించేటప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని స్తుతించాలని  ఉపనిషత్తులు చెప్తున్నాయి.
 
ఒకప్పుడు పార్వతీదేవి విహారానికి వెళుతూ తను ధరించడానికి ఆభరణాలు, ఐశ్వర్యం కావాలని అడిగింది. శివుడు కొద్దిగా విభూతి ఇచ్చి కుబేరుని వద్దకు వెళ్లి అది ఇచ్చి కావలిసినవి తీసుకోమన్నాడు. ఆవిడ కుబేరుని వద్దకు వెళ్లి దానికి సరిపడా నగలు, బంగారాన్ని ఇవ్వాల్సిందిగా కోరింది. అలా ఆ విభూతిని త్రాసులో పెడితే నవ నిధులకు అధిపతి అయిన కేబేరుని ఐశ్వర్యము అంతా పెట్టినా త్రాసు లేవలేదు. 
vibhuthi
 
దీనిని బట్టి తాను నిరాడంబరముగా వుండి అందరికీ అన్నీ ఇస్తాడు శివుడు. శంకరుడు ఐశ్వర్య ప్రదాత. అలాంటి శివునిని సోమవారం పూజించి.. విభూతి ధారణ చేస్తే అష్టైశ్వర్యాలు సొంతం అవుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు