ధనుర్మాసంలో బ్రహ్మముహూర్త కాలంలో ఆలయాలను సందర్శించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇంకా ఆలయాల్లో తిరుప్పావై, తిరువెంబావై పాశురాలను పఠించడం ద్వారా పుణ్యఫలాలు సిద్ధిస్తాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వివాహ అడ్డంకులు, విఘ్నాలు తొలగిపోతాయి. ధనుర్మాసంలో తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంతో వాయు శక్తి, స్వచ్ఛమైన గాలి భూమి మొత్తం వ్యాపించి వుంటుంది. ఆ స్వచ్ఛమైన గాలిని శ్వాసించడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరానికి కొత్త ఉత్తేజం లభిస్తుంది.