Guru Purnima 2025: గురు పౌర్ణమి- ఇంద్రయోగం.. మిథునం- కన్యాతో పాటు ఆ రాశులకు శుభం

సెల్వి

బుధవారం, 9 జులై 2025 (19:40 IST)
Indra Yoga
ఆషాఢ పూర్ణిమ లేదా గురు పౌర్ణమి జూలై 10 అంటే గురువారం నాడు రాబోతుంది. పవిత్రమైన రోజున తమ జీవితానికి మార్గనిర్దేశం చేసిన గురువులను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఇదే రోజున కొన్ని శుభ యాదృచ్ఛికాలు కూడా జరగనున్నాయి. అదే రోజు శక్తివంతమైన ఇంద్రయోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో మనం ఏ శుభకార్యం చేపట్టినా అది విజయవంతమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 
ఈ రోజున వ్యాపారాలను ప్రారంభించడం, కొత్త పనులను చేయడం, ఆర్థికపరమైన అభివృద్ధి తోడ్పడే కార్యాలు చేపట్టడం ద్వారా జయం చేకూరుతుంది. జ్యోతిష్యం ప్రకారం, గురు పూర్ణిమ వేళ బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయనున్నారు. ​గురు పూర్ణిమ వేళ ఏర్పడే ఇంద్ర యోగం వేళ మిథున రాశి వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సమయంలో మీ శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. 
 
గురు పూర్ణిమ రోజున ఇంద్ర యోగం ప్రభావంతో కన్య రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ​గురు పూర్ణిమ రోజున గురుడు మిథున రాశిలో సంచారం చేసే వేళ ఇంద్ర యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం వేళ ధనస్సు రాశి వారికి మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కుంభ, మీనరాశుల వారికి కూడా ఈ శుభ యోగంతో అనుకున్న కార్యాల్లో విజయం చేకూరుతుంది. 
 
గురు పౌర్ణమి తేదీ, శుభ ముహూర్తాలు:
గురు పూర్ణిమ తేదీ: జూలై 10 (గురువారం)
తిథి ప్రారంభం: జూలై 9 బుధవారం తెల్లవారుజామున 1: 37 గంటలకు
తిథి ముగింపు : జూలై 10 అర్థరాత్రి
 
బ్రహ్మ ముహూర్తం: ఉదయం 4: 10 నుంచి 4: 50 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11: 59 నుంచి 12: 54 వరకు
విజయ ముహూర్తం: మద్యాహ్నం 12: 45 నుంచి 7: 41 వరకు
గోధూళి ముహూర్తం రాత్రి 7: 21 నుంచి 7: 41 వరకు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు