ఆదివారం పూట మాంసాహారం తీసుకోకుండా ఉండటం మంచిది. లేదంటే ఆదివారం సూర్యోదయ సమయంలో పూజ ముగించాలి. మాంసాహారం, మద్యం ముట్టుకోకూడదు. ఆదివారం ఉదయం పూట శుచిగా స్నానమాచరించి.. పసుపు రంగు దుస్తులు ధరించి.. బెల్లం, బియ్యంతో సూర్యుడిని పూజించాలి. సూర్యోదయం సమయాన రాగి చెంబుతో పవిత్రమైన నీటిలో కుంకుమను కలిపి సూర్యనమస్కారం చేయాలి. ఆదిత్య హృదయ స్తోత్రంతో సూర్యుడిని పూజించాలి.
ఆదివారమే కాకుండా ప్రతినిత్యం నిద్రలేవగానే సూర్యభగవానుడిని దర్శించుకుంటే ఆ రోజంతా శుభ ఫలితాలుంటాయి. అలాగే నిద్రలేవగానే స్వర్ణం, తామరపువ్వు, దీపం వెలుగు, అద్దం, సువాసనను వెదజల్లే చందనం, ఆవు-గేదె, వృక్షాలు, కుడిచేయి, మృదంగం, సముద్రం, పంట పొలాలు, గోపురాలను నిద్రలేవగానే వీక్షించేవారికి ఆ రోజంతా శుభప్రదం.