బుధాష్టమి, దుర్గాష్టమి, భీష్మాష్టమి రోజున కాలభైరవ అష్టకాన్ని చదివితే సర్వశుభాలు చేకూరుతాయి. ఇంకా శని, రాహు, కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పాపాలు నశిస్తాయి. కోపం తగ్గుతుంది. కాలభైరవ అష్టకాన్ని ప్రతి నిత్యం, సోమవారం, అష్టమి తిథుల్లో పఠించడం ద్వారా పాప విముక్తి లభిస్తుంది.
కాల భైరవ అష్టకం గత పాపాలను పోగొట్టుకుని ఆత్మను శుద్ధి చేసే శక్తిని ఇస్తుంది. కాల భైరవ అష్టకం పారాయణం ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడుతుంది , భక్తులను జ్ఞానోదయం, విముక్తి (మోక్షం) వైపు నడిపిస్తుంది.
ఈ శ్లోకం సంపద, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కాలభైరవ అష్టకం జపించడం వల్ల భక్తులు జీవితంలోని వివిధ కోణాల్లో అడ్డంకులను అధిగమించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. కాల భైరవ అష్టకాన్ని క్రమం తప్పకుండా పారాయణం చేయడం వల్ల మానసిక స్పష్టత, ఏకాగ్రత పెంపొందుతాయి. ఇంకా కెరీర్‌లో అభివృద్ధి, వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది.