వైకుంఠ ఏకాదశి వ్రతమాచరించిన వారు ద్వాదశి రోజున పారణ చేయడం ఐతిహ్యం. ఈ ఏడాది ద్వాదశి తిథి.. జనవరి 3, 2023, రాత్రి 10.19 నిమిషాలకు ముగియనుంది. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి పుణ్య స్నానాలు చేయాలి. పుణ్యస్నానం చేసిన అనంతరం విష్ణుమూర్తిని ప్రార్థించాలి.
స్వామికి నైవేద్యంగా పండ్లు, పంచామృతం అభిషేకం సమర్పించాలి. అలాగే విష్ణు సహస్ర నామాన్ని, నారాయణ స్తోత్రాన్ని పఠించాలి. ఇంకా కూర్మావతారమైన తాబేలును పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. బంగారం వర్ణంలో ఉండే తాబేలు ఇంట్లో వుంచడం శుభప్రదం.