ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 24వ తేదీ శుక్రవారం నాడు మాఘ పూర్ణిమ వచ్చింది. శనివారం రోజున ఈ పౌర్ణమి రావడంతో.. దీనికి మరింత ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. మాఘ మాసంలో దేవతలు తమ సర్వ శక్తులు, తేజస్సును గంగా జలాల్లో ఉంచుతారు. అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పదానిగా భావిస్తారు.
మాఘ స్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. అనంతరం శ్రీ మహా విష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. మాఘ పౌర్ణమి వేళ మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. గొడుగు, నువ్వులు దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి.
అయితే మాఘ పూర్ణిమ నల్లని దుస్తులను ధరించకండి. ఎందుకంటే దీని వల్ల మీ మేధస్సు క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజున ఎవరితోనూ గొడవ పడకండి. షేవింగ్, కటింగ్ కూడా చేయించుకోవద్దు. గోర్లను కూడా కత్తిరించొద్దు.