మాఘ పౌర్ణమి రోజు గౌరీ దేవి జననం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. చక్రపొంగలి, పరమాన్నం, కొబ్బరికాయ, పండ్లు వంటి నైవేద్యాలు భగవంతుడికి సమర్పించాలి. మాఘ పౌర్ణిమ రోజు చేసే దానాలకు కోటిరెట్ల అధిక ఫలం ఉంటుంది.
బియ్యం, నువ్వులు, బెల్లంతో చేసిన ఆహార పదార్ధాన్ని దానం ఇవ్వాలి. పక్షులకు కాస్త ధాన్యం వేయడం, చీమలు, కీటకాలకు కాస్త పంచదార వేయడం, మనుషులకు ఉపచారాలు చేయడం మంచిది. రాత్రి పూట చంద్రుడికి పూజించాలి. ఆయనకు పాలతో చేసిన నైవేద్యాలు సమర్పించవచ్చు. సత్యనారాయణ వ్రతం చేయడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.