మార్గశిర పంచమి.. సర్పాల పూజ.. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఇలా చేస్తే?

మంగళవారం, 7 డిశెంబరు 2021 (15:09 IST)
మార్గశిర పంచమి రోజున నాగపంచమిగా పరిగణించబడుతోంది. మార్గశిర నాగ పంచమి రోజున నాగులను పూజిస్తే కాలసర్ప, నాగదోషాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం. 
 
నాగ పంచమిని బ్రహ్మదేవుడు, ఆదిశేషుని అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు. నాగుల చవితి మాదిరిగానే నాగ పంచమి నాడు నాగ దేవతను పూజిస్తే సర్పపూజతో సంతాన ప్రాప్తి, రాహు-కేతు దోషాలు కూడా తొలగిపోతాయి. 
 
ఈ రకమైన పూజలు మన తెలుగు రాష్ట్రాల్లోని శ్రీకాళహస్తిశ్వర ఆలయంలో ఎక్కువగా జరుగుతాయి. నాగ పంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకలసంపదలు కలిగి, రాహు, కేతు, సర్ప, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. 
 
నాగ పంచమి రోజున కేరళలోని అనంత పద్మనాభ స్వామికి అభిషేకం, అలంకారాలు చేయించిన వారికి ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.
 
నాగ పంచమి రోజున ప్రధానంగా తొమ్మిది రకాల పాములను పూజిస్తారు. అనంత, వాసుకి, శేష, కలియ, శంఖపాల, తక్షక, కంబాల, ధ్రుత రాష్ట్రం మరియు పద్మనాభం వంటి రకాల పాములను పూజిస్తారు.
 
నాగ పంచమి రోజున గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి ఆహారం తీసుకోవాలి. ఇలా నాగ పంచమి రోజున నాగులను పూజించిన వారికి ఎలాంటి విషపూరిత బాధలనేవి ఉండవు. ఈ పవిత్రమైన రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల కలిగే రోగాల నుండి ఉపశమనం కలుగుతుంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు