మహాశివరాత్రి- నువ్వుల నూనె, బియ్యం పిండి.. బంగారు తామర పుష్పాలతో?

సెల్వి

గురువారం, 7 మార్చి 2024 (22:34 IST)
Lord Shiva
మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయాల్లో మహేశునికి అభిషేకాది పూజలు చేయించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయిస్తే.. జీవితంలో అనారోగ్య సమస్యలు తలెత్తవు. గోవు పాలు, పంచితంతో, పంచకవ్యంతో శివునికి అభిషేకం చేస్తే ముక్తి లభిస్తుంది. గోవు పాలుతో అభిషేకం చేస్తే దీర్ఘాయుష్షు చేకూరుతుంది. 
 
తేనెతో అభిషేకం చేస్తే మానసిక ఆందోళనలను తొలగిపోతాయి. మధురమైన గాత్రం లభిస్తుంది. 1000 నిమ్మకాయలతో శివునికి అభిషేకం చేయిస్తే.. అజ్ఞానం తొలగిపోతుంది. పంచదారతో అభిషేకం జీవితంలో మనశ్శాంతి లభిస్తుంది. కొబ్బరి నీటితో శివునికి శివరాత్రి రోజున అభిషేకం చేయిస్తే కైలాస ప్రాప్తి లభిస్తుంది. 
 
పంచామృతంతో అభిషేకంతో మనోబలం, కార్యసిద్ధి ఏర్పడుతుంది. పెరుగుతో శివాభిషేకం ఆరోగ్యం, శారీరక దారుఢ్యం ఏర్పడుతుంది. చెరకు రసంతో అభిషేకం ఆయుర్దాయాన్ని ఇస్తుంది. 
 
పసుపు- ఉద్యోగ ప్రాప్తి 
ద్రాక్ష రసంతో అభిషేకం- అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. 
గోవు నేతితో అభిషేకం-స్వర్గ ప్రాప్తి 
బియ్యం పిండితో - అప్పుల బాధ తొలగిపోతుంది.
అన్నాభిషేకం - ఉదర రుగ్మతలు తొలగిపోతాయి 
గంగా జలంతో అభిషేకం.. ఈతిబాధలు తొలగిపోతాయి. భయం వుండదు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. చందనం- పనీరుతో అభిషేకం.. దైవభక్తి ఏర్పడుతుంది. రుద్రాభిషేకం చేస్తే సర్వకార్యసిద్ధి. 
 
బంగారు తామర పుష్పాలతో మహాశివునికి అభిషేకం చేస్తే.. స్వర్గ ప్రాప్తి, భోగభాగ్యాలు చేకూరుతాయి. దానిమ్మ- పదోన్నతి, నెయ్యి- మోక్షం, ఉసిరి- పిత్త వ్యాధులు తొలిపోతాయి. పండ్లరసం- దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. 
 
శుద్ధి జలంతో శివాభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులు, అష్టకష్టాలు తొలగిపోతాయి. పుష్పాలతో శివునికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు