దాంతో శివుడు, శరభేశ్వరుడనే అవతారంలో నరసింహస్వామిని ఓడిస్తాడు. అలా ఆయన కోపాన్ని చల్లార్చుతాడు. ఆ సమయంలో అమ్మవారు- శూలిని, మహాప్రత్యంగిర అనే రెండు రూపాలు ధరించి శరభేశ్వరునికి రెండు రెక్కలుగా నిలిచింది.
ఈ అమ్మవారిని మొదటగా ప్రత్యంగిరా, అంగీరసుడు అనే ఇద్దరు రుషులు దర్శించారట. అందుకనే ఆ ఇద్దరి పేర్లతో ఈమెను ప్రత్యంగిరా అని పిలుస్తుంటారు. ప్రత్యంగిరా అంటే శత్రువులను మట్టుబెట్టి ఎదురుతిరిగే దేవత. దుష్టశక్తులు పీడిస్తున్నాయని భయపడుతున్నవారు, చేతబడి జరిగిందనే అనుమానం ఉన్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి తంత్రమైనా పనిచేయదు. ప్రత్యంగిరాదేవికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే నికుంబల హోమం.
ప్రత్యంగిరాదేవి సింహముఖంతో ఉంటుంది కాబట్టి, ఆమెకు నారసింహి అన్న పేరు కూడా ఉంది. ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారంలో నష్టం, శత్రుభయం వున్నవారు ఈమెను ఆరాధిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. శుక్ర, మంగళ, శని, ఆది వారాల్లో ఈమెను పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది.