సంకష్ట హర చతుర్థి రోజున గరికను సమర్పిస్తే..?

బుధవారం, 8 జులై 2020 (11:38 IST)
సంకష్ట హర చతుర్థి రోజున గరికను సమర్పిస్తే.. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. వినాయకుడికి దూర్వా లేదా గరిక అని ఆకుని నివేదించడం విశేషం. లేతగా ఉండే గరికపోచలు 3 అంగుళాలకు మించకుండా ఆరోగ్యకరమైన వాటిని వినాయకుడికి నామాలు చెబుతూ నివేదిస్తారు. కుడుములు మొదలయిన పదార్థాలను వినాయకుడికి ఇష్టంగా నివేదిస్తారు. అలాగే శెనగలు, ఉండ్రాళ్ళను నివేదిస్తారు.
 
ఇంకా వినాయకుడికి ప్రీతిగా ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని పూలు, ధూపం దీపం నైవేద్యంగా సమర్పిస్తారు. మందార పువ్వులు వినాయకుడికి అర్చనలో విశేషంగా సమర్పిస్తారు. శక్తి కొలదీ విగ్రహంలో గాని లేదా పటములో కానీ వినాయకుడిని పూజించవచ్చు. జిల్లేడు గణపతి దీనినే అర్క గణపతి అని కూడా పిలుస్తారు. ఈ మూర్తిని పూజించినా కోరుకున్న కోరికలు తొందరగా తీరడానికి ఒక సాధనమని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
 
వసంతకాలంలో వచ్చిన ఈ సంకష్టహర చతుర్థిని నాడు ఉపవసించడం ద్వారా అన్ని రకాల పాపాలు తొలగిపోతాయి. గణేశుడికి ప్రత్యేక ప్రార్థనలు చేసి, నువ్వులను, లడ్డూలను బ్రాహ్మణుడికి దానం చేయడం ద్వారా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. కష్టకాలంలో గణేశుడి పూజ ద్వారా వాటిని తొలగిస్తుంది. ఆయనను నిష్టతో పూజించే వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి.. ఎరుపు రంగు దుస్తులు ధరించడం ఉత్తమం. 
 
ఆపై గణపతి పూజ చేయాలి. గణపతి విగ్రహాన్ని పూలతో అలంకరించి.. నువ్వులు, బెల్లం, లడ్డూలు, పువ్వులు, నీరు, ధూపం, గంధం, అరటి లేదా కొబ్బరికాయతో పూజించాలి. సంకష్ట హర చతుర్థి రోజున గణపతికి నువ్వుల మోదకాలు సమర్పించాలి. చంద్రోదయానికి ముందే గణపతిని పూజించి.. సంకష్ట హర వ్రత కథను పఠించండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు