Sravana Masam 2025: శ్రావణ మాసం: తులసి, బిల్వ మొక్కలను నాటితే ఏంటి ఫలితం?

సెల్వి

శుక్రవారం, 18 జులై 2025 (19:07 IST)
Bilwa Tree
శ్రావణ మాసం త్వరలో ప్రారంభం కానుంది. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. అలాగే ముగ్గురమ్మలను, శివ, విష్ణువులను పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
అలాగే శ్రావణ మాసంలో శ్రీలక్ష్మిని, శివునిని ప్రసన్నం చేసుకోవాలంటే.. వారి అనుగ్రహం పొందాలంటే.. బిల్వ వృక్షాన్ని నాటడం మంచిది. 
 
ఈ వృక్షం నుండి లభించే బిల్వదళంను శివుడికి సమర్పించడం అపార పుణ్యఫలాన్ని ఇస్తుంది. వాస్తు ప్రకారం ఈ వృక్షాన్ని ఇంటి ఆవరణలో నాటితే.. దారిద్య్రం తొలగిపోయి.. సౌఖ్యం, సమృద్ధి కలుగుతాయని విశ్వాసం.
 
అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణంలో తులసిని నాటడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి.  వీటితో పాటు శమీ మొక్కలను, తెల్ల జిల్లేడును శ్రావణంలో నాటితే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు