గురువారం పూట రాఘవేంద్రునికి చేసే పూజలు సకల సంపదలను ఇస్తాయి. గురువారం పూట ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకుని.. పూజగదిని రంగ వల్లికలు, పువ్వులతో అలంకరించుకోవాలి. రాఘవేంద్ర స్వామి పటాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి. ఏడు వారాలు రాఘవేంద్ర స్వామికి ఉపవసించి పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
ఆరు వారాలు ఎప్పటిలా పూజ చేసి.. ఏడో వారం రాఘవేంద్ర స్వామికి తులసీని సమర్పించాలి. రాఘవేంద్ర స్వామి పటం ముంచి పంచముఖ దీపాన్ని వెలగించాలి. పండ్లు, తమలపాకులు, కొబ్బరిని పూజకు సిద్ధం చేసుకోవాలి. విఘ్నేశ్వరునికి పూజ చేసి.. రాఘవేంద్ర స్వామిని ప్రార్థించాలి. పూజకు ముందు స్వామిపై మనస్సును నిలిపి సంకల్పం చెప్పుకోవడం మరిచిపోకూడదు.
గురువారం ఉపవాసం వుండేవారు.. మంచం మీద పడుకోకూడదు. నిష్టతో రాఘవేంద్ర స్వామిని ఏడు వారాలు ఉపవసించి పూజిస్తే అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.