సోమవారం పూట శివారాధనతో కార్యసిద్ధి.. పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే? (video)

సోమవారం, 7 సెప్టెంబరు 2020 (05:01 IST)
సోమవారం శివరాధనతో విశిష్ట ఫలితాలు.. 
సోమవారం పరమ శివుని పూజిస్తే అనుకున్న కార్యాలు చేకూరుతాయి. సోమవారం పార్వతి దేవికి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. సోమవారం రోజున చేసిన శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మహర్షులు చెప్తున్నారు. ఈ రోజున సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా శివరాధాన చేస్తాడట. 
 
అందువలన ఈ రోజున పరమశివుడిని భక్తితో అభిషేకించిన వారిని ఆయనతో పాటు విష్ణువు కూడా అనుగ్రహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా శివాలయాల్లో జరిగే అభిషేకాలు, పూజలు చేయించేవారికి వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఉంటుంది. 
 
సోమవారం ఉదయం దగ్గరల్లోని శివాలయానికి వెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేసుకుని, ఉపవాసం ఉండాలి. మళ్లీ సాయంత్రం ప్రదోష కాలమందు ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకుని, మళ్లీ శివాలయానికి వెళ్లి ఈశ్వరుని దర్శించుకుని దీపారాధన చేయాలి. 
 
శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం నాడు మారెడు చెట్టుకు గల బిల్వ పత్ర ఆకులతో పూజిస్తే భక్తుల కోరికలన్నీ తీరుస్తారని చాలా మంది నమ్ముతారు. అలాగే సోమవారంలో పాలతో శివునికి అభిషేకం చేయించడం ద్వారా అనుకున్న కోరికలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు