మీ రాశి ఫలితాలు (22-06-2017)... కొనుగోళ్లే లాభదాయకం...

బుధవారం, 21 జూన్ 2017 (22:11 IST)
మేషం : ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కానవస్తుంది. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. సభలు, సమావేశాలు వేడుకల్లో చురుకుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించినట్లైతే సత్ఫలితాలు లభిస్తాయి. 
 
వృషభం : మీ కృషికి గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి వుంటుంది. ప్రయాణ రీత్యా ధనవ్యయం మానసిక ప్రశాంతత కరువవుతుంది. రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
మిథునం : కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులల్లో ఏకాగ్రత లోపం వల్ల అధికారులతో మాటపడవలసివస్తుంది. షేర్ల అమ్మకం కంటే కొనుగోళ్ళే లాభదాయకం. ఏజెన్సీ, నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. 
 
కర్కాటకం : మీ శ్రమకు లభించిన ప్రతిఫలంతో సంతృప్తి చెందాల్సి వుంటుంది. వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. రాజీ మార్గంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇతరులకు మేలు చేసినా విమర్శలు తప్పవు. ఉద్యోగస్తులు పై అధికారులతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. 
 
సింహం: బంధు మిత్రుల రాకపోకలు చికాకుపరుస్తాయి. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. పరిచయం ఉన్న వ్యక్తుల గురించి ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. విద్యార్థినులకు ఉన్నత విద్యలలో అవకాశం లభిస్తుంది. స్త్రీలకు ఆత్మీయుల కలయిక కొత్త ఉత్సాహాన్నిస్తుంది.
 
కన్య : ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. ప్రయాణాలు ఆశించినంత ఉత్సాహంగా సాగవు. స్త్రీలకు షాపింగ్‌లోను, స్కీమ్‌ల పట్ల అవగాహన అవసరం. ఉద్యోగస్తులకు కొత్త అధికారులు, తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉపాధ్యాయులకు నూతన వాతవరణం నిరుత్సాహం కలిగిస్తుంది.
 
తుల : హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
 
వృశ్చికం : భాగస్వామిక చర్చల్లో ఏకాగ్రత వహించండి. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఒక వ్యవహారం నిమిత్తం కొత్త ప్రదేశానికి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. మీ జీవిత భాగస్వామి సలహా పాటించడం మంచిది.
 
ధనుస్సు: ఆర్థికంగా పురోగమించటానికి చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ సంతానం ఉన్నత విద్యల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. అనుకున్న పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. యాదృశ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
మకరం : శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. స్త్రీల తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదు. మీ శ్రీమతి, శ్రీవారి ఆరోగ్యంలో జాగ్రత్త వహిస్తారు. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
కుంభం : నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. పారిశ్రామిక రంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. 
 
మీనం : స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, స్వశక్తిపై జీవించాలన్న పట్టుదల అధికమవుతాయి. కొన్ని వ్యవహారాలు అనుకూలించకపోవడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.

వెబ్దునియా పై చదవండి