22-03-2020 నుంచి 28-03-2020 మీ వార రాశిఫలాలు

శనివారం, 21 మార్చి 2020 (18:11 IST)
మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం.
ఈ వారం సంప్రదింపులకు అనుకూలం. ఆచితూచి వ్యవహరించాలి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆర్థిక లావాదేవీలు ముగింపునకొస్తాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. ఖర్చులు సామాన్యం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వేడుకలు సన్నాహాలు సాగిస్తారు. పనులు సానుకూలమవుతాయి. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. షేర్ల, క్రయ విక్రయాలకు అనుకూలం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
ఖర్చులు విరీతం. ధనసహాయం అర్థించేందుకు మనస్కరించదు. రాబడిపై దృష్టిపెడతారు. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. ప్రముఖుల దర్శనీయం వీలుపడదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పువస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. లౌక్యంగా వ్యవహరించాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. కార్యక్రమాల్లో మార్పులుంటాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. బంధుమిత్రులు వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని తెలుసుకుంటారు. సంతానం కదలికలపై దృష్టిసారించండి. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వు 1, 2, 3 పాదాలు. 
మనోధైర్యంతో ముందుకు సాగండి, సన్నిహితుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. కృషి ఫలించకున్నా యత్నించామన్న సంతృప్తి ఉంటుంది. పనులు వేగవంతమవుతాయి. ఆదాయం వ్యయాలకు పొంతన ఉండదు. గురు, శుక్రవారాల్లో ఊహించని ఖర్చులు ఉంటాయి ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. దంపతుల మధ్య అమరికలు తగదు. సంతానం, భివిష్యత్‌పై దృష్టిపెడతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. ఆడిటర్లకు ఆదాయాభివృద్ధి. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
శుభకార్యానికి హాజరవుతారు. బంధువుత్వాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. సంతానం విషయంలో శుభపరిణామాలు ఉంటాయి. శనివారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. గృహమార్పు కలిసి వస్తుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఎదుటివారికి కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటాయి. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ బాధలు తొలగుతాయి. తాకట్టు విడిపించుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మానసికంగా కుదుటపడతారు. పనుల్లో ఆటంకాలెదురవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. వ్యాపకాలు, పరిచయాలు బలపడతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆది, సోమవారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, స్థానచలనం. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. వాహనచోదకులకు దూకుడు తగదు. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హిస్త, చిత్త 1, 2 పాదాలు. 
పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. సాధ్యంకాని, హామీలివ్వవద్దు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వ్యవహారానుకూలత ఉంది. మంగళ, బుధవారాల్లో చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. మీ ప్రమేయం అనివార్యం. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
వేడుకను ఘనంగా చేస్తారు. పరియాలు బలపడతాయి. వాయిదాపడిన పనులు ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆదాయం బాగుటుంది. చిన్న చిన్న సమస్యల మినహా ఇబ్బందులుండవు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వ్యతిరేకులు తారసపడతారు. సాధ్యకాని హామీలివ్వవద్దు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. గురు, ఆదివారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సంతానం దూకుడును కట్టడి చేయండి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారుల తీరు ఇబ్బంది కలిగిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యోష్ట 
బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆత్మీయులను కలుసుకుంటారు. అనుకూలతులున్నాయి. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ఖర్చులు అధికం. పత్రాల రెన్యువల్ అలక్ష్యం తగదు. శుక్ర, శనివారాల్లో నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. శుభకార్యాల్లో పాల్గొంటారు. నిర్మాణాలు, మరమ్మతులు ముగింపునకు వస్తాయి. ఉపాధ్యాయులకు శ్రమ, ఒత్తిడి అధికం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం.
పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ఖర్చులు విపరీతం. స్థిరాస్తి ధనం అందుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. సోమ, మంగళవారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. బుధవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. గృహంలో మార్పుచేర్పులకు అనూకూలం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాభద్ర 1, 2, 3 పాదాలు. 
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆత్మీయులను కలుసుకుంటారు. గురు, శుక్రవారాల్లో ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు ఒక పట్టాన పూర్తికావు. మీపై శకునాల ప్రభావం అధికం. ఒక అహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమార్పు అనివార్యం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలప దృష్టిపెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు వేగవంతమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. శనివారంనాడు ప్రముఖుల సందర్శనీయం వీలుపడదు. గృహమార్పునకు అనుకూలం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. బెట్టింగ్‌లు, జూదాల జోలికి పోవద్దు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు