డిప్రెషన్‌లో ఉన్నారా... ఐతే ఇవిగోండి కొన్ని చిట్కాలు

బుధవారం, 2 జనవరి 2013 (16:57 IST)
FILE
డిప్రెషన్ ఏర్పడటానికి కారణాలు ఎక్కువే. జీవితంలో ఏదో ఒక వయసులో తాత్కాలికంగా డిప్రెషన్‌లోకి వెళ్ళని వారు అరుదు. ఐతే డిప్రెషన్‌‍కి తరచుగా గురవటం లేదా డిప్రెషన్ వదిలించుకోకపోవడం ప్రమాదకరమని సైకాలజి నిపుణులు అంటున్నారు.

డిప్రెషన్ అనేది వంశపారంపర్యంగా వచ్చే జబ్బు. అనుకోకుండా ఎదురైన చేదు అనుభవం డిప్రెషన్‌కి దారితీయవచ్చు. అందుచేత డిప్రెషన్‌ను తగ్గించుకోవాలంటే ముందు మీ ఆలోచనలు మార్చుకోవాలి. మీ పరిసరాలను శుభ్రపరుచుకోవాలి. ఆహార, నడక, వ్యాయామంలో ఒక క్రమ పద్ధతి పెట్టుకోవాలి.

మీకు బాగా ఇష్టమైన సంగీతాన్ని వినాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఎటువంటి అంటు రోగాలకు గురికావొద్దు. మాంసాహారం, పొగత్రాగే అలవాటును ఆపేయాలి, సువాససనలు అందించే పూల మొక్కలను ఉంచుకోండి. మీ సమస్యలను ఆప్తులతో చర్చించి వారి సహాయం పొందండి.

వెబ్దునియా పై చదవండి