శనివారం నాడు శనీశ్వరుని నీలిరంగు పువ్వులతో పూజిస్తే..?

శనివారం, 29 సెప్టెంబరు 2018 (15:08 IST)
శనివారం అంటేనే గుర్తుకు వచ్చేది శనీశ్వరుడు. ఈ రోజున శనివ్రతం చేయడం వలన ఈతిబాధలు తొలగిపోతాయి. ఈ శనివ్రతాన్ని ఎలా ఆచరించాలంటే.. సూర్యోదయానికి ముందుగా లేచి స్నానం చేయాలి. ఆ తరువాత పూజగది, పటాలు శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు పటాలకు పసుపుకుంకుమలతో బొట్టుపెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి.
 
ముఖ్యంగా పూజకు ముందుగా విఘ్నేశ్వరుని స్తుతించాలి. ఆ తరువాత ఈ వ్రతాన్ని ఆచరించాలి. శనివారం రోజున శనీర్వునికి నీలిరంగు పువ్వులతో పూజలు చేయడం వలన శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని పురాణాలలో చెబుతున్నారు. అలానే శనీర్వుని శాంతింపజేయడానికి ఈ వ్రతాన్ని చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. 
 
ప్రతి శనివారం రోజున శనీర్వుని పూజించడం వలన సిరిసంపదలు చేకూరతాయని చెప్తున్నారు. ఈ శని వ్రతాన్ని ఆచరించే ముందుగా శివపార్వతుల పటాలకు అక్షింతలతో పూజలు చేసిన తరువాతనే శనీశ్వురుని పూజలు చేయాలని చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు