ప్రతి గురువారం " ఓం గం గ్లౌం శ్రీం బ్లూం హ్రీం క్లీం సాయినాథాయనమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. గురువారం సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి సాయిబాబా పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి.
సూర్యోదయం జరిగిన తర్వాత కొద్ది నిమిషాల్లో పై మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఈతి బాధలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు. శ్రీ సాయి మీద మనస్సు లగ్నం చేసి, ప్రతినిత్యం సూర్యోదయానికి తర్వాత పై మంత్రాన్ని 40 రోజుల పాటు ఉచ్చరించడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారని పండితులు చెబుతున్నారు. అంతేగాకుండా.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడం, సకల సంపదలు చేకూరడం జరుగుతాయని వారు అంటున్నారు.
ఇంకా గురువారం పూట సాయిబాబా ఆలయానికి వెళ్లి ఆయన దర్బారు శుభ్రం చేయడం చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. దీంతో పాటు సాయిబాబా ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత ముందు ఎవరికైనా కాసింత దానం చేయండి.
ఇలా 40 రోజులు సాయిబాబా మంటపాన్ని శుభ్రం చేస్తూ.. అక్కడ ఇచ్చే ప్రసాదాన్ని ఉన్నంతలో కాసింత దానం చేసి తాను తింటే ఆర్థిక సమస్యలు, ఈతిబాధలు పరిష్కారమవుతాయని పురోహితులు అంటున్నారు.