శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

సెల్వి

శనివారం, 5 ఏప్రియల్ 2025 (23:42 IST)
Ram Navami 2025
శ్రీరామ నవమి ఏప్రిల్ 6న వస్తోంది. చైత్ర శుద్ధ నవమి నాడు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున దానం చేయడం ఎంతో విశిష్టతతో కూడుకున్నది. ఈ రోజు ఇతరుల అవసరాన్ని బట్టి దానం చేయడం మంచిది. 
 
రామాలయంలో శ్రీరామ నవమి రోజున దీపం వెలిగించి.. పూజ పూర్తయ్యాక ప్రసాదాన్ని పంచడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. శ్రీరామ నవమి రోజున అన్నదానం చేయడం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కర్మ ఫలితాలను తొలగిస్తుంది. అలాగే కుంకుమను శ్రీరామనవమి రోజున దానం చేయడం ద్వారా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. 
 
ఇంకా శ్రీరామునికి పాలలో కుంకుమ పువ్వు వేసి అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులంటూ వుండవు.. డబ్బుకు ఎలాంటి లోటు వుండదు. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద 11 దీపాలను వెలిగించడం ద్వారా సంపద, శ్రేయస్సుతో పాటు ఆరోగ్యం చేకూరుతుంది. ఇంకా హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది. 
 
ఈ రోజున శ్రీరాముని స్తోత్రాలు, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది. రామకోటి రాయడం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. శ్రీరామ నవమి రోజున రామచరిత, సుందరకాండ పారాయణం చేయడం మంచిది. 
 
శ్రీరామ నవమి తిథి ఏప్రిల్ 5న సాయంత్రం 07.26కి ప్రారంభమై, ఏప్రిల్ 6 సాయంత్రం 07.25కి ముగుస్తుంది. ఏప్రిల్ ఆరో తేదీన ఉదయం 11.06 గంటల నుంచి 01.39 వరకు శుభం. ఈ రోజున సీతారాముల వారి కల్యాణాన్ని వీక్షించడం.. ఆలయాల్లో సీతారాముల కల్యాణం నిర్వహించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. సీతారాముల పూజతో ఆర్థిక ఇబ్బందులు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు