వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నల్ల చీమలు తిరగడం మంచిదే అంటున్నారు. ఇంట్లోకి నల్లచీమలు రావడం శుభప్రదమని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇంట్లో గుంపుగా నల్లచీమలు కనిపిస్తే.. అది సంపదకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అర్థం చేసుకోవాలి. ఇంకా ఆర్థిక ఇబ్బందులు త్వరలో తొలగిపోతాయనేందుకు గుర్తు.
ఇంకా వాహన సౌఖ్యం, సంపద, ఇంట్లో ప్రశాంతత, ఆర్థిక వృద్ధి, సుఖసంతోషాలు చేకూరుతాయి. బియ్యం బస్తా దగ్గర నల్లటి చీమలు కనిపిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. బీరువాల పక్కన నల్లటి చీమలు తిరగాడితే.. బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఇంకా చెప్పాలంటే నల్ల చీమలు దక్షిణ దిశవైపు నుంచి వస్తే.. ఆ ఇంట సంపదకు లోటుండదని వాస్తు చెప్తోంది. అలాగే ఉత్తరం వైపు నుంచి నల్ల చీమలు వస్తే భవిష్యత్తులో సుఖసంతోషాలకు ఢోకా వుండదని అర్థం. కానీ తూర్పు దిశలో నుంచి నల్ల చీమలు ఇంట్లోకి వస్తే చెడు వార్తలు వినే అవకాశం వుంది. పడమర దిశ నుంచి వస్తే ప్రయాణాలు తలపెడతారని అర్థమని చెప్తున్నారు.. వాస్తు నిపుణులు.