న కాంక్ష్యే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై ర్జీవితేన వా
భావము: హే కృష్ణా! అయిన వాళ్లందరినీ పోగొట్టుకుని ఎవరి కోసం ఈ రాజ్యమును పాలించాలి? అందరినీ పోగొట్టుకున్న ఈ జీవితం ఎందుకు? నాకు ఈ భోగాలు, సుఖాలపై ఆశ లేదు. నాకు ముక్తి మార్గమునొసగుము. అని అర్జునుడు యుద్ధమునకు ముందు కృష్ణుని వేడుకున్నాడు.