అమ్మలగన్న అమ్మ పార్వతీదేవీని నిత్యం స్తుతిస్తే అనుకున్న కార్యం నెరవేరుతుందని పండితులు అంటున్నారు. ప్రతిరోజూ పార్వతీ దేవీ శ్లోకాలతో పార్వతీ దేవిని సమయం దొరికినప్పుడల్లా స్తుతిస్తే అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం.
ఇందులో భాగంగా లలిత సహస్ర నామ స్తోత్రముతో నిత్యం ప్రార్థించే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురోహితులు అంటున్నారు.
183 శ్రీ లలిత సహస్రనామ స్తోత్రమ్‌లో మొదటి శ్లోకం మీ కోసం..
అథ శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమ్11
శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్ సింహాసనేశ్వరీ1
చిదగ్ని కుండసంభూతా దేవకార్య సముద్యతా11
ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి గౌరీదేవిని మనసారా ధ్యానించి పై మంత్రమును ఉచ్ఛరించిన వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
అదీ శుక్రవారం పూట మహిళలు శుచిగా స్నానమాచరించి, నుదుట సింధూరంతో దేవిని పై మంత్రముతో స్తుతిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం.
శుక్రవారం ఉదయం ఇంటిని శుభ్రం చేసి, పూజగదిని ముగ్గులు, పసుపు కుంకుమలతో అలంకరించి చక్కెర పొంగలిని నైవేద్యం పెట్టి పై మంత్రం ద్వారా అమ్మవారిని ప్రార్థిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని పురోహితులు అంటున్నారు.