ఎలుకను లేదా చచ్చిన ఎలుకను నోటకరచుకుని పిల్లి ఎదురుపడితే...?

గురువారం, 18 ఆగస్టు 2016 (14:23 IST)
శకునాలను... వాటి ఫలితాలపై భారతీయులకు ఎంతగానో విశ్వాసముంది. శుభకార్యాల నిమిత్తం బయలుదేరుతున్నప్పుడు... శుభకార్యాలకి సంబంధించిన పనులను ప్రారంభిస్తూ ఉన్నప్పుడు సహజంగానే శకునం చూస్తుంటారు. శకునం ఏమాత్రం అనుకూలంగా లేకపోతే శుభకార్యాలను సైతం వాయిదా వేసుకోవడమే కాదు ఏకంగా రద్దు చేసుకోవడం జరుగుతుంది. అంతగా శకునాలను నమ్ముతారు.  
 
అయితే, పెంపుడు పిల్లికి తప్పులేదనే విశ్వాసం ఉంది. ఇంట్లో పెంచుకునే పిల్లి కాకుండా మరో పిల్లి ఎదురుపడితే దానిని అపశకునంగానే భావిస్తుంటారు. శుభకార్యాల నిమిత్తం బయలుదేరినప్పుడు హఠాత్తుగా ఓ పిల్లి ఎదురొచ్చి ప్రదక్షిణంలా చుట్టూ తిరిగి వెళితే, వెంటనే ఆ ప్రయాణం మానుకోవాలని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే ఈ విధమైన శకునం వలన కార్యహాని జరుగుతుంది.
 
అయితే, శుభకార్యాల నిమిత్తం బయలుదేరుతున్నప్పుడు పిల్లి ఒకానొక విధంగా మాత్రమే ఎదురు రావడం మంచిదని శాస్త్రం చెబుతోంది. ఎలుకను చంపి.. చచ్చిన ఎలుకను నోటకరచుకుని పిల్లి ఎదురుపడితే అది శుభసూచకంగా భావించాలి. కార్యసిద్ధి జరుగుతుందని గ్రహించాలి. మిగతా సందర్భాల్లో ఇబ్బందులు తప్పవని శాస్త్రం స్పష్టం చేస్తోంది. 

వెబ్దునియా పై చదవండి